Take a fresh look at your lifestyle.

రాష్ట్ర నకాష్ సంఘం జాతీయ పతాకావిష్కరణ

బోడుప్పల్, ముద్ర విలేకరి: బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని పెంటారెడ్డి కాలనీలో గల రాష్ట్ర నకాష్ సంఘం రాష్ట్ర కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ చేశారు. శ్రీమాతా నిమిషాంబ భవన్ వద్ద శుక్రవారం ఉదయం జాతీయ పతాకాన్ని రాష్ట్ర నకాష్ సంఘం అధ్యక్షుడు ఆర్.కేశవరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాసరావు, నిమిషాంబ ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, అసోసియేట్ అధ్యక్షుడు అశోక్ కుమార్, ఆలయ ట్రస్ట్ సభ్యులు, తదితరులు హాజరయ్యారు.

బోడుప్పల్ కార్పొరేషన్ లో….

బోడుప్పల్ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద కమిషనర్ ఎ.శైలజ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు, కో -ఆప్షన్ సభ్యులు, ఎ. ఏం. సి. శ్యామసుందర్ రావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.