- 20 కేసులు నమోదు
ముద్ర, కామారెడ్డి టౌన్: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణములో ఉన్న దాదాపు 20 వరకు పాన్ షాపులలో స్పెషల్ డ్రైవ్ చేసి,తనిఖీ లు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.ఇందులో సిరిసిల్ల రోడ్డు, శ్రీరామ్ నగర్ లో ఉన్న తులసి దుకాణం వద్ద,పరడైజ్ Shop,Vintage Cafe లపై వీరు ప్రజల ఆరోగ్యానికి హానికరమైన టొబాకో ప్రొడక్ట్ లను అమ్మడమే కాకుండా,ఇతరులకు ఇబ్బందింకలిగించే విధముగా ధూమపానం చేసేవిధంగా ఏర్పాట్లు చేసుకోవడం,పబ్లిక్ స్మోకింగ్ ను ప్రోత్సహించడం, పిల్లలకు సిగరెట్, మో. గు వాటిని అమ్మడం చేస్తున్నందున, వీరిపై criminal case లు చేయడం జరిగింది. అంతేగాక మరికొంత మంది వారి షాపు ల వద్ద పబ్లిక్ స్మోకింగ్ చేయిస్తున్నందున వారిపై కూడా కేసులు చేయడం జరిగింది.ఇక మీదట కామారెడ్డి పట్టణంలో గాని, ఎక్కడైనా గాని ప్రజారోగ్యానికి ఇబ్బంది కలిగించే విధంగా స్మోకింగ్ చేయు పదార్థాలను ఎవరైనా అమ్మినా, పబ్లిక్ స్మోకింగ్ కి ప్రోత్సహించిన, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడిన, అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ వారి తరుపున హెచ్చరించడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.
