Take a fresh look at your lifestyle.

బీరవెల్లి లో బుద్ధ విగ్రహాష్కరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి లో మాల సంఘం ఆధ్వర్యంలో బుద్ధ విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికే శాంతి మార్గాన్ని చూపెట్టింది గౌతమ బుద్ధుడన్నారు. అంబేద్కర్ తన చివరి రోజులలో బౌద్ధ మతాన్ని స్వీకరించారన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సర్పంచ్ ఎల్లన్న, రాజేశ్వర్, తాళ్ల చిన్నయ్య, నిమ్మల ప్రేమానందం, మురళి, నిమ్మల గంగాధర్, ఎర్రన్న, రాజు, సాయి, నరసయ్య, బిఎస్ఐ జిల్లా ట్రెజరర్ చేపూరి అడెల్లు, మాల మహానాడు జిల్లా నేత గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.