Take a fresh look at your lifestyle.

చివరి ఆయకట్టు  సాగు నీరు చేరేలా చర్యలు

  • కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
  • ఎస్సారెస్పీ కాల్వలను తనిఖీ చేసిన కలెక్టర్.

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: చివరి ఆయకట్టు  వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  కమాన్ పూర్, పెద్దపల్లి ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ 43.5 కిమీ వద్ద ఎస్సారెస్పీ డీ 83 కాలువ ను, కమాన్ పూర్ మండలం గుండారం వద్ద ఆర్.ఎస్.బీ కెనాల్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి మాట్లాడారూ.ఎస్సారెస్పీ నుంచి విడుదలయ్యే నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, చివరి ఆయకట్టు  వరకు సాగు నీరు అందేలా  అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన సాగునీటి సరఫరా లో ఎలాంటి అవాంతరాలు ఉండటానికి వీలు లేదని కలెక్టర్ అధికారులకు సూచించారు.చివరి విడత నీటి విడుదల జరుగుతున్నందున ఎక్కడ పోలాలు ఎండిపోకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.కాల్వలో సిల్ట్ తొలగింపు, చిన్న చిన్న మరమ్మత్తులకు ప్రతిపాదనలు అందిస్తే పూర్తి అయ్యేలా చర్యలు  తీసుకుంటామని  అన్నారు.ఈ   పర్యటనలో జిల్లా కలెక్టర్  వెంట ఎస్. ఈ. సత్యరాజ్ చంద్ర, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కే .శ్రీనివాస్, మంథని ఈఈ బలరామయ్య, సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.