Take a fresh look at your lifestyle.

జిల్లాలో 9964 నూతన రేషన్ కార్డులు మంజూరు

  • కలెక్టర్ రాహుల్ రాజ్.

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లావ్యాప్తంగా 9964 నూతన రేషన్ కార్డులు మంజూరు అయినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం పాపన్నపేట్ మండలం చిత్రియాల్ గ్రామంలో నూతన రేషన్ కార్డుల పంపిణీలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు.34,730 కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయడం జరిగిందన్నారు.జిల్లా వ్యాప్తంగా మొత్తం 44,694 మందికి నూతన రేషన్ కార్డు ద్వారా లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. జనవరి 26న ప్రజా పాలన గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డుల కోసం ఒక ఫార్మాట్ వారికి అందించి ఇచ్చిన దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హత ఆధారంగా రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పాపన్నపేట మండలంలో 479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయగా కుటుంబ సభ్యుల పేర్ల నమోదు 2342 చేసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ సతీష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.