Take a fresh look at your lifestyle.

సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు 

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: కల్వకుర్తి ఎక్సైజ్ పరిధిలోని పలు తండాల్లో మంగళవారం మహబూబ్ నగర్ ఎన్ఫోర్స్మెంట్, కల్వకుర్తి ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించినట్లు సిఐ వెంకట్ రెడ్డి తెలిపారు. వంగూరు మండలం తిరుమలగిరి తండా, ఎడ్ల గడ్డ తండా, తిమ్మారెడ్డిపల్లి తండాలలో దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో ఆరు క్వింటాల బెల్లం ,30 కిలోల పట్టిక ,5 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి, సిబ్బంది జనార్దన్ రెడ్డి పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.