Take a fresh look at your lifestyle.

ఉప్పల్ లో రూ.116 కోట్ల నిధులతో అభివృద్ధి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 

ముద్ర : కాప్రా

ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని డివిజన్లో రూ.116 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు.
నాచారం డివిజన్లో 4 కోట్ల 66 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి నాచారం డివిజన్ కార్పొరేటర్ శ్శాంతి సాయిజెన్ శేఖర్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నాచారం డివిజన్ హెచ్ఎంటి నగర్ డివిజన్లో సమానంగా అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు
అనంతరం హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారితో కలిసి ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు ను సందర్శించారు

ఈ సందర్భంగా హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువును 30 కోట్ల రూపాయలతో సుందరీ కరుణించలనట్టు తెలిపారు
తద్వారా నాచారంలో దోమల సమస్యకు శాశ్వత పరిష్కారం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎఈ సూరజ్ వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ నాచారంలోని వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులు బారాస నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.