కోరుట్ల/ఇబ్రహీంపట్నం, ముద్ర విలేఖరి: భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో మండలాధ్యక్షులు బాయ్ లింగరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలు, ఎంపిటిసి, జడ్పిటిసి, ఎలక్షన్ల మండల కార్యశాల నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధి లు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ, మండల ప్రభారీ ధోనికెలనవీన్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ధర్మం వైపు మొగ్గు చూపుతుందని, నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుండి ఇస్తున్నారన్నారు. బిజెపిలో కుటుంబ పాలన లేదని, స్థానిక ఎన్నికలలో విజయం సాధించే దిశగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. దేశంలో ప్రతి పౌరుడు దేశాభివృద్ధికై పాటుపడాలని, ప్రతి పౌరుడి ఎదుగుదలే బిజెపి లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలో రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బిజెపి కే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, నేటి నుండి బిజెపి కార్యకర్త ఒక ఆయుధం గా మారి స్థానిక ఎన్నికల్లో బీజేపి అంటే ఏంటో రానున్న ఎన్నికల్లో తెలియ జేయాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల్ కన్వీనర్ డా. వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ, ప్రభారీలు, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్ యాదవ్, రణధీర్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గంప శీను, వివిధ గ్రామాల బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.