Take a fresh look at your lifestyle.

యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం-జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి

పత్రికా ప్రకటన
తేదీ: 06.02.2026
హైదరాబాద్ జిల్లా

యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం

పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలి

అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి

 

శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సమన్వయ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఈ. వెంకటాచారి, అలాగే యూపీఎస్సీ ఇన్స్పెక్టింగ్ అధికారి విజయ్ కుమార్ కలిసి పరీక్షల నిర్వహణ ప్రక్రియను సమీక్షించారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష–2026ను 08.02.2026 (ఆదివారం) రోజున హైదరాబాద్ కేంద్ర పరిధిలోని ఉదయం 9.30 గంటల నుండి 11.30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలియజేశారు.

ఈ పరీక్షకు 15 ఉప కేంద్రాలలో 6,000 మందికి పైగా అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు.

అదే రోజున యూపీఎస్సీ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ప్రిలిమినరీ పరీక్ష–2026ను 2 ఉప కేంద్రాలలో ఉదయం 9.30 గంటల నుండి 11.30 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు, సుమారు 600 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.

రెండు పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఓఎంఆర్ ఆధారితంగా నిర్వహించబడతాయని, వికలాంగ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయని తెలియజేశారు.

పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని డి. ఆర్. ఓ సూచించారు.

పరీక్షా కేంద్రాలలో మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహించడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించారు. కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అలాగే, నీటి సరఫరా కల్పించాలని వాటర్ బోర్డు అధికారులకు సూచించారు. అలాగే వైద్య శాఖ ఏఎన్‌ఎం సిబ్బందిని ఫస్ట్ ఎయిడ్ సౌకర్యాలు, అవసరమైన ఔషధాలు, ఫేస్ మాస్కులు, శానిటైజర్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో నియమించాలని సూచించారు. పరీక్షా కేంద్రాలను కవర్ చేసే మార్గాల్లో తగిన బస్సు సేవలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.

అలాగే లోకల్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్లు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులు మరియు అవసరమైన సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, రూట్ ఆఫీసర్లు పరీక్షా సామాగ్రి కేంద్రాలకు చేరేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.

అభ్యర్థుల గుర్తింపునకు ఫేస్ ఆథెంటికేషన్ వ్యవస్థ అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షప్రారంభానికి 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్ర గేట్లు మూసివేయబడతాయని, అభ్యర్థులు కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని అన్నారు. ఈ-అడ్మిట్ కార్డు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా అనధికార గ్యాడ్జెట్లు పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావడం పూర్తిగా నిషేధించబడిందని పేర్కొన్నారు. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకొని, వ్యక్తిగత వస్తువుల భద్రతకు స్వయంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యాకుబ్ రెడ్డి తో పాటు లోకల్ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, వెన్యూ సూపర్వైసర్లు పోలీస్, జీహెచ్ఎంసీ, వైద్య–ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, వాటర్ బోర్డు, టీజీఎస్‌ఆర్‌టీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, పోస్టల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.