ప్రముఖుల హాజరుకు అడ్డంకులు సృష్టించిన కొంతమంది సొంత పార్టీ నేతలు
ముద్ర, నారాయణపేట:
నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ గా కొండా శ్వేతా సత్యా యాదవ్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన… పార్టీపరంగా పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించి సుమారు నెలరోజుల పాటు కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోనే ఏకైక మున్సిపాలిటీ నారాయణపేటలో బిజెపి సొంతం కావడంతో అట్టహాసంగా రాష్ట్ర పార్టీ నాయకులు, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రముఖుల సమక్షంలో కార్యక్రమాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కొంతమంది సొంత పార్టీ నేతలు రాష్ట్ర పార్టీ నాయకులను, మరికొంత మంది ఉమ్మడి జిల్లా ప్రముఖులను మున్సిపల్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారానికి ఇక్కడికి రానివ్వకుండా అడ్డంకులు సృష్టించారని స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనాప్పటికీ ఓ సామాజిక వర్గం మరో సామాజిక వర్గంపై చిన్న చూపు చూడడమే ఇందుకు ప్రధాన కారణం అవుతే… సొంత పార్టీ క్రియాశీల నేతలు అనతి కాలంలోనే ఉన్నతమైన హోదా పొందిన వ్యక్తిని చూసి ఓర్వలేకే ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు ఏర్పరుస్తున్నారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ గురువారం జరిగిన చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ముందుగా పూజా కార్యక్రమాలు, యజ్ఞం నిర్వహించి చైర్పర్సన్ బాధ్యతలు చేపట్టగా పలువురు ఘనంగా సన్మానించారు.