Take a fresh look at your lifestyle.

వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీని వేగవంతం చేయాలి

  • ఖాళీ అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మార్చాలి.
  • తక్కువ టీచింగ్ స్టాఫ్ డిపార్ట్ మెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  • ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, విద్యాశాఖ కార్యదర్శులకు టీజీడీఏ వినతి పత్రం.

హైదరాబాద్, ముద్ర: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని వేగవంతం చేయాలని తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్(టీజీడీఏ) విజ్ఞప్తి చేసింది. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మార్చి భర్తీ చేయాలని కోరింది. అన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా పడదని సూచించింది. ఈమేరకు టీజీడీఏ అధ్యక్షులు డాక్టర్ పెద్దిరెడ్డి నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ తిరుపతి బొల్లం, గౌరవాధ్యక్షులు డాక్టర్ పొల్లది రమణారావు, డాక్టర్ మహేందర్, డాక్టర్ రాజేష్, డాక్టర్ స్వామి నాయక్, డాక్టర్ కృష్ణ బంటు, డాక్టర్ వెంకటేశ్ లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణలకు వినతి పత్రం సమర్పించారు. పోస్టుల భర్తీలో తక్కువ టీచింగ్ స్టాఫ్ ఉన్న డిపార్ట్ మెంట్లకు ప్రధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్టంలోని అన్ని విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3000 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఒకేసారీ భర్తీ చేయాలని సూచించింది. కేవలం 500 పోస్టులనే భర్తీ చేస్తామంటూ చేస్తున్న ప్రకటనలపై అసహనం వ్యక్తం చేశారు. 13 ఏళ్లు గా యూనివర్సిటీ లో టీచింగ్ రిక్రూట్మెంట్ జరిగక పోవడం తో డిపార్ట్మెంట్స్ మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన 2లక్షల ఉద్యోగాల భర్తీ హామీని నెరవేర్చాలని సూచించారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు.. కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీల్లోని ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలని కోరింది. గత 12ఏళ్లుగా యూనివర్సిటీలను పట్టించుకోక పోవడంతో డిపార్ట్ మెంట్లు మూత పడే స్థాయికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు అధిక నిధులు కేటాయించి, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. టీజీడీఏ ప్రతినిధుల సమస్యలను సామరస్యపూర్వకంగా విన్న ఛైర్మన్ బాలకిష్టారెడ్డి.. సానుకూలంగా స్పందించారు. అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతామని, సాధ్యమైనంత వరకు పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని, యూనివర్సిటీల్లోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.