శాసనసభలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ఆమోదించడం చారిత్రాత్మకం.-.. జిలాని కాంగ్రెస్ పార్టీ తాండూర్ లీగల్ సెల్ ఇంచార్జ్.
ముద్ర, తాండూర్:
తెలంగాణ శాసనసభలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయం అని న్యాయవాది జిలాని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల భద్రత కోసం తీసుకున్న కీలక నిర్ణయానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి జిలాని అన్నారు. బెదిరింపులు, అవమానాలకు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన “అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు”ను ఆమోదించినందుకు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఇన్‌చార్జ్ అడ్వొకేట్ జిలాని రాష్ట్ర ముఖ్యమంత్రి కి మంత్రి మండలికి మరియు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులు, అవమానాలకు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన “అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు”ను ఆమోదించినందుకు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఇంచార్జ్ జిలాని కృతజ్ఞతలు తెలిపారు.ఈ యొక్క చట్టం న్యాయవాదులు వారి కుటుంబ సభ్యుల పై హింసకు పాల్పడే వ్యక్తులకు 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు 25 వేల నుంచి 50 వేల వరకు జరిమానా కూడా విధిస్తారని అన్నారు. న్యాయవాదుల ఆస్తులకు నష్టం కలిగిస్తే, అందుకు సంబంధించిన నష్టాన్ని న్యాయస్థానం ద్వారా నిర్ధారించి పరిహారం అందుతుందని అన్నారు.