Take a fresh look at your lifestyle.

గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్ కార్మికుల పేర్లు వెంటనే ఆన్లైన్ చేయాలి : జిపి ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పైళ్ల గణపతి రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్ కార్మికుల పేర్లు వెంటనే ఆన్లైన్ చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పైళ్ల గణపతి రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం  సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల కై పరిష్కారానికి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది అందరిని రెండవ పిఆర్సి పరిధిలోకి తీసుకోవాలని గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆన్లైన్లో లేని కార్మికుల పేర్లు వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జీవో నెంబర్ 51 సవరణ మల్టీపర్పస్ విధానం రద్దు కొరకు తీర్మానం చేయాలన్నారు. కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచుల వేధింపులు కార్మికుల తొలగింపు పైన చర్యలు చేపట్టాలని మూడు నెలల బకాయి వేతనాలు తక్షణమే విడుదల చేయాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. సిబ్బందిని పర్మినెంట్ చేయాలని ప్రమాదం జరిగిన మరణించిన సిబ్బంది కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని పీఆ ర్సీ సౌకర్యం భీమా గ్రాండ్ సౌకర్యాలు కల్పించాలని గ్రామపంచా సిబ్బంది అందరికీ రిటర్మెంట్ బెనిఫిట్ అమలు చేయాలని మరణించిన కార్మికుని దహన సంస్కారాలకు కనీసం 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేష్, గ్రామపంచాయతీ గౌరవ అధ్యక్షులు దాసరి పాండు, సిఐటియు ఉపాధ్యక్షులు మాయ కృష్ణ, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పొట్ట యాదమ్మ, గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకరికంటి రాము,నాయకులు కూరెళ్ల కిష్టయ్య, నాంపల్లి భాస్కర్, బందెల భిక్షం, స్వామి, రమేష్, చంద్రకాంత్, స్వామి గౌడ్, గుంతకండ్ల అనిత, కవిత పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.