ముద్ర ప్రతినిధి, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కొత్తూరు-సి లో ఏకరూప టీ షర్ట్స్ మరియు టై బెల్ట్ లు మరియు విద్యా సామాగ్రిని తెలుగు సమితి అఫ్ నేబ్రాస్కా మరియు స్ఫూర్తి ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్.సొసైటీ వీరశెట్టి వినోద్ సోమిరెడ్డిశ్వేత, సామ ఉమల సహకారంతో శనివారం పంపిణీ చేసారు. ఈ సందర్భంగా సింగం మనోహర్ మనోహర్ మాట్లాడుతూ స్ఫూర్తి ఫౌండేషన్ వారు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులపై చూపించే ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు.స్ఫూర్తి ఎడ్యుకేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రామసహాయం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల తల్లితండ్రులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేపేద నిరుపేద విద్యార్థులకు సహకారం అందుంచుటకు సంస్థ పని చేస్తుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు బుధవారము, శనివారము వేసుకునే విధంగా ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ప్రవేట్ పాఠశాల దీటుగా ఉండాలనె ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలొ చదివే విద్యార్థులు ఉండే విధంగా ఏకరూప టీ షర్ట్స్ మరియు టై బెల్ట్ లు అందివ్వడం జరగిందని అన్నారు.ఈ కార్యక్రమము లో స్ఫూర్తి ఎడ్యుకేషన్ ప్రధానకార్యదర్శి మేకల కృష్ణయ్య హై స్కూల్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బి వీరన్న, స్ఫూర్తి ఎడ్యుకేషన్ సభ్యులు, వీరిశెట్టి వినోద్,సామ ఉమ పాఠశాల ఉపాధ్యాయలు. అమితాబ్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నాంపల్లి సునీత, కొత్త మల్లారెడ్డి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
