ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: ఇటీవల దివంగతులైన ప్రముఖ ఇంద్రజాలికులు,వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బివి పట్టాభి రామ్ సంస్మరణ సభనుశుక్రవారం హైదరాబాద్ సత్యసాయి నిగమా గమంలో ‘పట్టాభి జీవితోత్సవం’ పేరిట నిర్వహించగా ఖని మెజీషియన్లు మేజిక్ రాజా,హరి హాజరయ్యారు.ఆయన చిత్రపటా నికి పూలతో నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఇంద్రజాల వ్యాప్తికి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.విద్యార్థులకు, ప్రజలకు మానసిక సమస్యలు తొలగించి మనో స్థైర్యాన్ని కలిగించారన్నారు.ఆయన మృతి ఇంద్రజాల,వ్యక్తిత్వ వికాస రంగా లకు తీరనిలోటన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన మెజీషియన్లు మల్లేశం,యతిరాజ్, ఎంఏ కరీం,పూర్ణ చందర్, బాంబుల శీనన్న తదితరులు పాల్గొన్నారు.