Take a fresh look at your lifestyle.

చిన్న శంకరంపేట్ పిఎస్ తనిఖీచేసిన ఎస్పీ

ముద్ర ప్రతినిధి,, మెదక్:
చిన్న శంకరంపేట్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు ఆకస్మికంగా
తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, వివిధ కేసుల్లో ఉన్న వాహనాల వివరాలను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు జరగాలని, స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఆదేశించారు.
అలాగే స్టేషన్ పరిధిలో ఉన్న కేడీలు, అనుమానితులు, రౌడీషీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తింపు పరికరాల ద్వారా తనిఖీ చేయాలని ఆదేశించారు. వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట్ సీఐ వెంకట రాజా గౌడ్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నారాయణ, సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.