రిటైర్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ పునరుద్దరణ చేయాలి టీజీ ఈ జేఏసీ డిమాండ్
ముద్ర, నారాయణపేట:
పిఆర్ సీ నివేదిక తక్షణమే అమలు చేయాలనీ…. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టి జి ఈ జెఎసి చైర్మన్ ఎం. నర్సింహరెడ్డి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తెలంగాణ రెండవ పిఆర్ సీ కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం పిఆర్సి గడువును పొడిగించకుండా వెంటనే నివేదిక తెప్పించుకొని సంఘాలతో చర్చించి 51% ఫిట్మెంట్ తో అమలు చేయాలని, పెండింగ్ బిల్లు లు ఒకేసారి చెల్లించాలన్నారు. 2024 మార్చి నుండి రిటైర్ అయిన 12000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయు లకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఏక మొత్తంగారూ. 10 వేల కోట్లు కేటాయించి పెండింగ్ బిల్లులు అన్ని క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందించారు. టీజీవో జిల్లా అధ్యక్షులు మొగులప్ప, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు వై జనార్దన్ రెడ్డి, శివరాములు, రెడ్డప్ప, సంతోష్ కుమార్, నర్సింహా రెడ్డి, రామ్ రెడ్డి, రామకృష్ణ, తిరుమలేష్, భీమయ్య, బాలరాజు, సూర్య చంద్ర, రషీద్, అలివేలమ్మ, అమరేందర్ కృష్ణ, రాణి , సురేందర్, దామోదర్, వెంకటరెడ్డి, వెంకటస్వామి, దేవేంద్రప్ప, రఘువీర్, బాలాజీ, బసప్ప, శ్రీనివాస్, ఉదయ భాను, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.