Take a fresh look at your lifestyle.

12న జరగనున్న దేశవ్యాప్త సమ్మె జయప్రదానికి విస్తృత ప్రచారం : సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్ర రెడ్డి

కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలి 

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెలో బీబీనగర్ మండలంలో పరిశ్రమలు బంద్ చేసి స్వచ్ఛందంగా కార్మికులు మండల కేంద్రంలో జరుగు ప్రదర్శన, సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సోమవారం మండలంలోని హిందుస్థాన్, ఎమ్ ఎస్ ఎన్ ఆర్గానిక్స్, మంచుకొండ ప్రకాష్ స్తంభాల కంపెనీ లలోని కార్మికులను సిఐటియు నాయకత్వం కరపత్రాలు, బుక్లెట్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చిందని అన్నారు. ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు అధునాతన బానిసలుగా మారే ప్రమాదం ఉన్నదని అన్నారు సంఘం పెట్టుకునే హక్కు గాని సమ్మె చేసే హక్కు గాని లేకుండా చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓవల్దాస్ సతీష్, గాడి శ్రీనివాస్, లోకదాసు పవన్, సిద్దు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.