ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్‌గా ఎంపికైన అనంతరం స్పీకర్ ను కలిసి శాలువాతో సన్మానించారు. పార్టీ నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి తన పి నమ్మకం తో ఈ పదవి ఇచ్చారాని, వారికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా అసెంబ్లీ కార్యకలాపాలు సజావుగా జరిగేలా కృషి చేస్తానని, సభా నిర్వహణలో స్పీకర్ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రజా సమస్యలను సభలో బలంగా ప్రతిపాదిస్తూ ప్రజల గొంతుకగా నిలబడటానికి కట్టుబడి ఉన్నానని, ప్రజాసేవను మరింత నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ విప్‌గా నియామకం పొందిన ఎమ్మెల్యే యెన్నం కు స్పీకర్ అభినందనలు తెలిపారు.
……………………………………
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.