ముద్ర న్యూస్, ఎండపల్లి:
ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన భూసారపు భూమయ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ బుధవారం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. భూసారపు భూమయ్య – భూలక్ష్మి దంపతుల కుమారుడు రాకేష్ వివాహం అంజలితో కాగా మంత్రి లక్ష్మణ్ కుమార్ నూతన వధూవరులను ఈ సందర్భంగా ఆశీర్వదించారు.