Take a fresh look at your lifestyle.

సనాతన ధర్మ సారథి ఛత్రపతి శివాజీ ఎంఎల్ఏ ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

భారతీయ సంస్కృతిని నేటి తరాలకు అందించిన సనాతన ధర్మ సారథి ఛత్రపతి శివాజీ అని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ కొనియాడారు. శివాజీ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన కృషి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, శివాజీ ఉత్సవ సమితి సభ్యులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.