Take a fresh look at your lifestyle.

యాదగిరిగుట్ట డిపో ముందు కార్మికుల సమ్మె..

బస్సులు లేక ఖాళీగా కనిపించిన బస్టాప్లు
భక్తులు లేక వెల వెల బోయిన యాదగిరి కొండ..
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన నిరవధిక సమ్మెను విజయవంతానికి యాదగిరిగుట్ట డిపో కార్మికులు, ఉద్యోగులు డిపో ముందు సమ్మెకు దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమ్మె కారణంగా డిపో నుంచి కేవలం 5 బస్సులను బయటికి పంపడం జరిగిందన్నారు.

ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ, పెండింగ్ పిఆర్సీలు, అలాగే 32 డిమాండ్ల పైన, ఎన్నికల ముందు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆర్టీసీ గురించి పెట్టిన అంశాలను నెరవేర్చమని ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. సమ్మె నోటీస్ కు ప్రభుత్వం జేఏసీ నాయకులను చర్చలకు పిలవగా చర్చలు విఫలం కావడంతో జేఏసీ సమ్మె దిగడం జరిగిందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆర్టీసీ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు ఇబ్బందులు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. ఉదయం నుంచి డిపోల నుంచి బస్సులు బయటకు రాకపోవడంతో హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు చేసే వారు, హైదరాబాదు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగస్తులు ప్రైవేటు ఉద్యోగస్తులు వ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బస్సులు రాకపోవడంతో ఇక చేసేది లేక ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. తమ సమ్మె నేపథ్యంలో ఆర్టీసి సిబ్బంది డిపో ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు. సమ్మెతో యాదగిరిగుట్ట డిపోలో 96 బస్సులకు గాను 5 బయటికి పోగా 91 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ సమ్మె తో భక్తులు లేక విలవిల బోయిన యాదగిరిగుట్ట ఆర్టీసీ జేఏసీ సమ్మె కు దిగడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం భక్తులు లేక వెలవెల బోయింది. కొండపైన క్యూలైన్లు భక్తులు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. యాదగిరిగుట్టకు భక్తులు అధికంగా బస్సుల ద్వారానే వస్తుంటారని సమ్మె కారణంగా భక్తులు రాలేకపోయారని దేవస్థాన అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.