రామకృష్ణపూర్, ముద్ర విలేకరి : మాదకద్రవ్యాల అలవాటుతో మంచి భవిష్యత్ నాశనమ వుతుందని,మాదకద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని రెండో ఎస్సై లలిత పేర్కొన్నారు.పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపెల్లి గ్రామంలో ఆదివారం మాదకద్రవ్యాల నియంత్రణ,రహదారి భద్రత కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.ఏఎస్సై వెంకయ్య,హెడ్ కానిస్టేబుల్ జంగు,అంకయ్య,రవి పాల్గొన్నారు.