Take a fresh look at your lifestyle.

వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కోరుట్ల, ముద్ర విలేఖరి: కోరుట్లలోని వంద పడకల ఆసుపత్రిలో త్రాగు నీటి సమస్య పరిష్కారానికై బీఆర్ఏస్ పార్టీ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి ఇచ్చిన 2 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను శుక్రవారం రోజు కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు వారి బంధువులకు దాహార్తి తీర్చేందుకు చేసిన ప్రయత్నం చాలా గొప్పదని, ఆర్వో వాటర్ ప్లాంట్ కు సహకరించిన ఎంపీ సురేష్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.అలాగే ఆసుపత్రికి సంబంధించి పూర్తి సిబ్బందిని, పరికరాలను అందించాలని ఆరోగ్యశాఖ మంత్రినీ మీడియా ముఖంగా కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.అనంతరం కల్లూరు రోడ్ లో ఉన్న ఫంక్షన్ హాల్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.సమావేశం లో ఈ నెల 27 వ తేదీన వరంగల్ లో జరిగే టీఆర్ఎస్ వజ్రోత్సవాలకు రావాలని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు ఆహ్వానం అందించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అన్వర్, మాజీ సర్పంచ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.