Take a fresh look at your lifestyle.

వివిధ గ్రామాలలో పలువురు బి ఆర్ ఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా నింపిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్

  • బాధిత కుటుంబాలకు అండగా ఉంటా.
  • మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.

తుంగతుర్తి, ముద్ర: తుంగతుర్తి మండలం లో నీ వివిధ గ్రామాలలో ఇటీవల వివిధ కారణాలవల్ల ఇబ్బందులకు గురి అయిన కుటుంబాలను మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సోమవారం పరామర్శించారు. అన్నారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబాలకు చెందిన పరాల ముత్తయ్య. కాట్ల ఉపేందర్ కుటుంబాలను పరామర్శించిన అనంతరం వెంపటి గ్రామ మాజీ సర్పంచ్ తునికి సాయిలు గారి కుటుంబం. మరియు మానాపురం గ్రామ శాఖ అధ్యక్షులు బానోతు సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన పలువురి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు .అనంతరం రావులపెల్లి మాజీ వార్డు మెంబర్ చింతకుంట్ల వీరన్న కుటుంబాన్ని పరామర్శించి అన్ని కుటుంబాలకు అండగా ఉంటానని భవిష్యత్ లో అందరికి మంచిరోజులు వస్తాయని భరోసా నింపారు. ఈ ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ తుంగతుర్తి బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండాగానీ రాములు గౌడ్.. కేతిరెడ్డి గోపాల్ రెడ్డి. లాకావత్ దశరద. కొండగడుపుల నాగయ్య, గాజుల యాదగిరి, దొంగరి శ్రీనివాస్, బెడడారాములు, ప్రవీణ్, శేఖర్, దాసు, గోపగాని రమేష్, తడకమళ్ల రవికుమార్, గోపగాని శ్రీనివాస్ గోపగాని వెంకన్న, పూర్ణ నాయక్, విజయ్ నాయక్, లాకావత్ శ్రీను నాయక్, చింత కుంట్ల మనోజ్, సురేష్, బొజ్జ సాయికిరణ్,K వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.