సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్ 13 బాల, బాలికలకు చెస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి, గండూరి కృపాకర్, ఎల్ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13 (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ సెలక్షన్స్ అండర్ 13 బాల, బాలికలకు స్థానిక (టి. టి. డి )కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారిని హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు మరియు షీల్డ్స్,మెడల్స్ మరియు ప్రశంస పత్రాలు అందిఇస్తామని మరియు ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామని వారు తెలిపారు.ఈ అవకాశాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా చదరంగం క్రీడాకారులు ఉపయోగించుకోవాలని వారు కోరారు. వివరాలకు ఎల్ సతీష్ కుమార్ కార్యదర్శి, చరవాణి నెం. 9394753343 సంప్రదించాలని తెలిపారు.
