బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌఠ (బి) గ్రామంలో గురువారం ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలను వివరించారు. రాశుల వారిగా ఆదాయ, వ్యయాలను వివరించారు. సంవత్సర వాతావరణ, వర్షాల వివరాలు తెలియజేశారు. ఎయే పంటలు ఈ సంవత్సర అనుకూలంగా ఉంటాయో తెలియజేశారు. అనంతరం గ్రామస్తులు రాబోయే శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృధ్ధి కమిటీ అధ్యక్షులు పిడుగు అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజు బాపు, సర్పంచి ఓరుగంటి స్వామి, ఉపసర్పంచ్ ఇట్టెడి రమణారెడ్డి, పెదకాపు గాజుల సురేందర్, పాత పెదకాపు గాజుల పోతయ్య, గ్రామస్తులు మురళీధర్ రెడ్డి, సింగడి రాంరెడ్డి, గంగాధర్, లస్మన్న, నోముల బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.