Take a fresh look at your lifestyle.

ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేయాలి

  • సీఎమ్ఓ కిరణ్ రాజ్ కుమార్

రామకృష్ణాపూర్,ముద్ర విలేకరి : సింగరేణి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు బాధ్యతతో పని చేయాలని సింగరేణి సీఎమ్ఓ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ సూచించారు. సోమవారం ఏరియా ఆసుపత్రిని సందర్శించి పలు విభాగాల పనితీరుపై డివైసీఎంవో ప్రసన్న కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కొంత మంది పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ హెచ్చరించారు. ఇకనైనా తమ పద్ధతి మార్చుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. తదుపరి తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని చెప్పారు. ఆసుపత్రికి వచ్చే కార్మికులకు,కార్మిక కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యంతో పాటు మందులను అందించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.