ముద్ర, ఇబ్రహీంపట్నం: బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన భారతదేశపు తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గౌడ సంఘం నేతలు అన్నారు.పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను ఇబ్రహీంపట్నం గౌడ సంఘం అధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ సంఘం నాయకులు,ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు పాలకుర్ల ఐలేష్ గౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళలు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ..బహుజన రాజ్యాధికారం కోసం పాపన్న గౌడ్ ఉద్యమించిన తీరు ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. నాటి పాలకులను ఎదిరించి, సామాన్యులకు న్యాయం జరిగేలా పోరాటం చేసిన గొప్ప యోధుడని కొనియాడారు.ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని, పాపన్న బాటలో బహుజనులు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు జి శివ గౌడ్, మహేష్ గౌడ్, కిరణ్ గౌడ్, భాస్కర్ గౌడ్, రాఘవేంద్ర గౌడ్, భాను గౌడ్, శివ గౌడ్, వినయ్, సాయి గౌడ్ తదితరులు పాల్గొనారు.