Take a fresh look at your lifestyle.

సిద్దిపేట పోలీసు ‘ఉద్యోగ మిత్ర’ జాబ్ మేళా దిగ్విజయం * 624 మందికి నియామక పత్రాలు అందజేసిన సీపీ రష్మీ పెరుమాల్

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

సిద్దిపేట జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర మెగా జాబ్ మేళా 2026 శనివారం ఘనంగా నిర్వహించారు.

పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి యువత భారీగా హాజరై అపూర్వ స్పందనను కనబరిచారు.


ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 65 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఐటి, ఫార్మా, టెక్నికల్, స్కిల్డ్ వర్క్, సేల్స్, సర్వీసెస్ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంచగా, 2000 మందికి పైగా అభ్యర్థులు హాజరై ముఖాముఖి ఇంటర్వ్యూల అనంతరం 624 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నియామక మేళాలో గణనీయ సంఖ్యలో మహిళా అభ్యర్థులు పాల్గొని విజయవంతంగా ఉద్యోగాలను సాధించడం ప్రత్యేకంగా నిలిచింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాల్, ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “పోలీసు శాఖ బాధ్యతలు కేవలం శాంతిభద్రతల పరిరక్షణతో మాత్రమే పరిమితం కాకుండా, సమాజ శ్రేయస్సులో భాగస్వామ్యం వహించడం కూడా కర్తవ్యం అన్నారు. యువతను సరైన దిశలో నడిపిస్తూ, వారి భవిష్యత్తుకు దృఢమైన పునాది వేయడం కోసం ‘ఉద్యోగ మిత్ర’ కార్యక్రమం ఒక వేదికగా నిలుస్తోంధన్నారు . ఒకే రోజు 624 మందికి ఉపాధి అవకాశాలు లభించడం ఎంతో ఆనందదాయకం” అని పేర్కొన్నారు.ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన సిద్దిపేట పోలీసు యంత్రాంగానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా యువతలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలపై అవగాహన పెరిగిందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, అదనపు డీసీపీ (ఎ.ఆర్) సుభాష్ చంద్రబోస్, ట్రైనీ ఐపిఎస్ ఆయేషా ఫాతిమా, ఎసిపిలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు, కంపెనీ ప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.