జోగిపేట,ముద్ర
ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మెన్ గా ఎన్నికైన యస్. కృష్ణారెడ్డినీ మంగళవారం జోగిపేటలోని ఆయన స్వగృహంలో TUWJ( IJU) జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యములో ఘనంగా సన్మానించారు.
ఈసందర్భంగా మున్సిపల్ చైర్మెన్ యస్.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదనీ,జోగిపేట పట్టణ అభివృద్ధికి మీవంతు సహాయ సహకారం వుండాలనీ కోరారు.మీసలహా సూచనలతో పట్టణ అభివృద్ధి చేసుకుందామన్నారు.
జోగిపేట పట్టణాన్ని పారిశుధ్యమైన పట్టణంగా , సంగారెడ్డి జిల్లాలోనే ఆదర్శవంతమైన మున్సిపల్ గా తీర్చిదిద్దడమే నాధ్యేయమ న్నారు.మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశానుసారం పట్టణాన్ని సర్వాంగ సుందరముగా తీర్చిదిద్ది పట్టణ రూపురేఖలు మారుస్తాననీ వెల్లడించారు.ప్రజల ఆశీర్వాదంతో నిరంతరము మీ సేవకై అందుబాటులో ఉంటానన్నారు.
ఈకార్యక్రమములో మాజీ కో- ఆప్షన్ మెంబర్ అల్లే శ్రీకాంత్, యూనియన్ జిల్లా కార్యదర్శి ఆనంద్ వర్ధన్,ఆందోల్ నియోజక వర్గ అధ్యక్షులు భూమయ్య ,ఆందోల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిపల్లి యాదగిరి,ఆందోల్ మండల అధ్యక్షులు అల్లే మహేష్, టేక్మల్ అధ్యక్షులు ధనుంజయ్,నర్సింలు,ఉల్వల రాజు,నాయకులు రాజేందర్,సుమన్,అశోక్, లయక్ అలీ తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post