Take a fresh look at your lifestyle.

వైద్య సిబ్బంది సేవా దృక్పథంతో పని చేయాలి

లంకాసాగర్ ప్రాధమిక ఆర్యోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజల పట్ల సేవా దృక్పథంతో పని చేసి, ప్రభుత్వ వైద్య సేవల పట్ల విశ్వాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.సోమవారం పెనుబల్లి మండలం లంకాసాగర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు, సాధారణ ప్రాధమిక వైద్యసేవలు, గర్భిణీ మహిళలకు అందుతున్న సేవలు, ల్యాబ్, ఆసుపత్రి నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది ప్రవర్తన విధానం మరింత మెరుగ్గా ఉండాలని, మనం ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామనే ఆలోచనతో పని చేయాలనిఉద్భోధించారు.

పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించడం, సేవా దృక్పథంతో పని చేయడం వైద్య శాఖలో చాలా అవసరమని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడానికి వీలు లేదని, ఆసుపత్రి సిబ్బంది సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, ఈ దిశగా మొదటి నుండే గర్భిణిలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, ప్రసవం దగ్గరికి వచ్చిన గర్భిణీ మహిళను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కడా మందుల కొరత ఉండటానికి వీల్లేదన్నారు.అంతకు ముందు కలెక్టర్ వైరా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణ, గ్రౌండ్, లైబ్రరీ‌, టాయిలెట్స్, త్రాగు నీరు, కిచెన్ షెడ్లను పరిశీలించారు.విద్యార్ధులతో మాట్లాడి ఇంగ్లీష్ గ్రామర్లో మెళుకువలు నేర్పారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్, వేంసూరు మండల తహసీల్దార్ గంటా ప్రతాప్, వైద్యాధికారులు డా. కిరణ్ కుమార్, పూలమ్మ, సుగుణ దేవి, వాసు, నిర్మల కుమారి, కృష్ణవేణి, వైరా మండల విద్యాశాఖ అధికారి కొత్తపల్లి వెంకటేశ్వర రావు, వైరా తహసిల్దార్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.