Take a fresh look at your lifestyle.

పిడుగు పడి పాడి గేదె మృతి

ముద్ర ప్రతినిధి, భువనగిరి 

పిడుగు పడి పాడి గేదె మృతి చెందిన గురువారం సంఘటన భువనగిరి మండలం తుక్కాపురం లో చోటు చేసుకుంది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తుక్కాపురం గ్రామానికి చెందిన వాళ్లపు పర్వతాలు తన వ్యవసాయ భావి వద్ద బర్రెల కొట్టంలో పాడి గేదెను కట్టివేశాడు. వర్షాలు కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా గేదెపై పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయింది. దీంతో 80 వేల నష్టం వాటిలిందని భావిత రైతు పర్వతాలు తెలిపాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.

Leave A Reply

Your email address will not be published.