ముద్ర : మల్కాజిగిరి
హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 5 నుండి మే 22, తేది వరకు జరగనున్న టాటా ఐపీఎల్-2026 మ్యాచ్‌ల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉప్పల్ డిసిపి సురేష్, ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసులు తెలిపారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలియజేశారు.
సుమారు 39,000 సీటింగ్ సామర్థ్యం గల ఈ స్టేడియంలో సుమారు 2000 మంది పోలీస్ సిబ్బందిని మోహరించన్నునట్లు తెలిపారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, భద్రతా విభాగాలు, టీఎస్ఎస్పీ దళాలు, మౌంటెడ్ పోలీస్, బాంబ్ డిస్పోజల్ టీమ్స్ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని.
స్టేడియం పరిసరాల్లో 430 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రతి గేట్ వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తుండగా, గేట్ నం.1 ను కేవలం ఆటగాళ్లకు మాత్రమే కేటాయించారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అగ్నిమాపక దళాలను సిద్ధంగా ఉంచారు. ప్రేక్షకులు తమ టికెట్ల ప్రకారం గేట్ల ద్వారా మాత్రమే ప్రవేశించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.