ముద్ర కూకట్ పల్లి : తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్ పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన సీఎం కప్ కరాటే పోటీల్లో కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన ముగ్గురు క్రీడాకారులు పతకాలు సాధించారు.
మహమ్మద్ జుబేర్: అండర్-17 (55 కేజీలు) – గోల్డ్ మెడల్
సిహెచ్. సంజయ్: 18+ విభాగం (60 కేజీలు) – గోల్డ్ మెడల్
బిహెచ్. నమ్రత: 18+ విభాగం (61 కేజీలు) – బ్రాంజ్ మెడల్
మంగళవారం హేమ దుర్గా భవన్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజేతలు బండి రమేష్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. రమేష్ వారిని శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే మహిళలకు ఆత్మరక్షణకు, పురుషులకు స్వీయ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. చిన్నతనం నుంచే ఆటలాడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతులు కూడా అందజేసిందని గుర్తుచేశారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్ అబ్దుల్ బాకీ ని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.