Take a fresh look at your lifestyle.

పిల్లల మర్రిని సందర్శించిన ప్రపంచ సుందరీమణులు

  • ఏఐజీ ఆసుపత్రిలో క్యాన్సర్ బాధితులను పరామర్శ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రపంచ సుందరీమణులు పర్యటనలు కొనసాగుతోన్నాయి. శుక్రవారం నాడు పాలమూరులో పర్యటించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లలమర్రి మహావృక్షాన్ని సందర్శించారు.22 మందితో కూడిన సుందరీమణుల బృందం పిల్లలమర్రి, విజయనగర కాలంనాటి రాజరాజేశ్వ ర ఆలయాన్ని వీక్షించారు. అక్కడి నుంచి సమీపంలోని పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజియా న్ని సందర్శించారు.16, 17, 18వ శాతాబ్దం నాటి సేకరించిన వస్తువులను, విగ్రహాలను పరిశీలించారు. పిల్లలమర్రి 3 నుంచి 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మర్రిచెట్టు. దీని ఆవరణలో సుందరీమణులు మొక్కలు నాటారు.7 శతాబ్దాల నాటి పిల్లలమర్రిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసేలా మహావృక్షం విశిష్ఠత, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. కాగా, హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ అసుపత్రిని సుందరీమణులు పరామర్శించారు.పేషెంట్లతో మాట్లాడి త్వరగా కోలుకోవాలని బొకేలను అందజేశారు.చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, బహుమతులను అందజేశారు.రోగులకు అందుతున్న చికిత్స విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.అనంతరం బ్యూటీ, హెల్త్ కేర్, ఫిట్ నెస్, డైట్ కార్యక్రమాలపై వైద్యులతో ముచ్చటించారు.

Leave A Reply

Your email address will not be published.