- గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు
- మేడిపల్లిలో యువత, విద్యార్థులు, ప్రజలకు అవగాహన
ముద్ర, ఇబ్రహీంపట్నం: ఆన్ లైన్ గేమింగ్, డ్రగ్స్,చెడు వ్యసనాలకు యువత,విద్యార్థులు దూరంగా ఉండాలని గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు సూచించారు.బుధవారం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో ఆన్ లైన్ గేమింగ్, డ్రగ్స్, పేకాటతో పాటు చెడు వ్యాసనలపై యువత, విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ లైన్ గేమ్స్ వ్యసనంగా మారి ఎంతో మంది యువత, విద్యార్థులు ఆర్దికంగా నష్టం చేకూర్చడంతో పాటు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని అన్నారు.డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను తీసుకుంటూ యువత పెడదారి పడుతున్నారని, నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు.విద్యార్థులు,యువత ఎప్పుడు వాటికి దూరంగా ఉండాలని సూచించారు.పిల్లలను నిరంతరం గమనిస్తూ ఉంటూ,వారికి సాధ్యమైనంత వరకు ఫోన్ ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు.పోలీసులు నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తారని,గ్రామాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.యువతను చెడుదారి పట్టిస్తున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ గ్రీన్ ఫార్మసీటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తేజంరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
