Take a fresh look at your lifestyle.

టెండర్లు రద్దు చేసి అభివృద్ధి అడ్డుకోవటం శోచనీయం బీజేపీ నేత రావుల రామ్ నాథ్ ధ్వజం

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల్లో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను టెండర్లు రద్దు చేసి ఒక వర్గం వారి కొమ్ము కాసేందుకు యత్నం చేయటం శోచనీయమని బీజేపీ సీనియర్ నేత రావుల రాంనాథ్ విమర్శించారు. ఈ మేరకు ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి తో మాట్లాడి నిర్మల్ మున్సిపల్ అభివృద్ధికై ₹.50 కోట్లు నిధులను కోరిన నేపథ్యంలో₹.15 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అధికారులతో సమీక్షించి 42 వార్డులలో అక్కడి అవసరాలను బట్టి నిధులు కేటాయించారని, టెండర్లు సైతం పూర్తయ్యాయని అన్నారు. ఐతే ఇటీవల నిర్వహించిన మున్సిపల్ అత్యవసర సమావేశంలో ఈ టెండర్లు రద్దు చేసి, ఒక వర్గానికి చెందిన పండగ కోసం సౌకర్యాల కల్పనకు మళ్ళించే యత్నం చేయటాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ విషయమై కలెక్టర్ కు స్థానిక మున్సిపల్ చైర్మన్ పై ఫిర్యాదు చేసినట్లు వివరించారు. నిర్మల్ పట్టణ అభివృద్ధికి, త్రాగునీటి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ₹.62.50 కోట్లు, మురికి నీటి శుద్ధి కోసం ₹.42 కోట్లతోఎస్ టి పి ప్లాంట్ల మంజూరుకు కృషి చేశారని అన్నారు. మెజార్టీ ప్రజల సౌకర్యాలను పక్కన పెట్టి, మైనార్టీ వర్గ సంక్షేమానికి యత్నించటం సిగ్గు చేటన్నారు. ఈ మీడియా సమావేశంలో కౌన్సిలర్లు గంజి రాజు, ఖమ్మం సురేందర్, సాదం అరవింద్, వొడిసెల అర్జున్, నరేష్, సాత్విక్, సూరజ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.