(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమవేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు తమ సమస్యల పరిష్కారంకై దాఖలు చేసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి దరఖాస్తుకు కచ్చితంగా సమాధానం ఇస్తూ తమ పరిధిలో ఉన్న వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం (52) ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి రెవెన్యూ శాఖవి 23, ఇతర శాఖలవి 29, మొత్తం 52 దరఖస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————-