Take a fresh look at your lifestyle.

ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలో సర్వమత సమ్మేళనం తో పట్టణంలో శాంతి నెలకొల్పే విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని భువనగిరి పట్టణ ఎస్‌ఐలు లక్ష్మినారాయణ, లక్ష్మినర్సయ్యలు అన్నారు. సోమవారం రంజాన్‌ పండుగ నేపధ్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శాంతి సమావేశం ఉద్దేశాన్ని వివరించారు. పట్టణవాసులు శాంతి స్థాపనకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎక్కడైతే శాంతిభద్రతలు సక్రమంగా ఉంటాయో, అక్కడ వ్యాపార వాణిజ్య అభివద్ధి పథంలో ఉంటాయన్నారు. ఈ సమావేశానికి పట్టణంలోని ముస్లీం మైనార్టీ నాయకులు హాజరై  శాంతి సామరస్యానికి అవసరమైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.