5 అంతస్థుల భవనం కూలి నలుగురు మృతి
ఇంకా తేలని మృతుల వివరాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఐదు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్‌లో మరో విషాదకరమైన ఘటన జరిగింది. టోలీచౌకీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనలో మరింత మంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో.. వారిని హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తున్నారు. టోలీచౌకీ అల్ హస్నాత్ కాలనీలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్థుల భవనం కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొందరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక భవనం కూలిన ఘటనకు సంబంధించిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని హుటాహుటిన సహాయక చర్యలు మొదలుపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కొత్త భవనానికి గోవా కర్రలు కట్టి.. వాటిపై నిలబడి కార్మికులు పనులు చేస్తుండగా.. అకస్మాత్తుగా ఆ కట్టెలు కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ఎవరు, వారి వివరాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
గోవా కర్రలు విరిగి ప్రమాదం
టోలిచౌకి అల్ హస్నాత్ కాలనీలో ఒక నూతన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. భవనం ఐదో అంతస్తు వద్ద ప్లాస్టరింగ్ పనుల కోసం గోవా కర్రలు ఏర్పాటు చేశారు. ఐదుగురు కార్మికులు ఆ కర్రలపై నిలబడి పనులు చేస్తుండగా, ఒక్కసారిగా ఆ నిర్మాణం భారం తట్టుకోలేక విరిగిపోయింది. దీంతో పైన ఉన్న ఐదుగురు కార్మికులు నేరుగా కింద పడిపోయారు.