Take a fresh look at your lifestyle.

పెళ్లికి ముందే అండగా… మాట నిలబెట్టుకున్న సర్ధార్ రవీందర్ సింగ్

 

– ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సర్ధార్ రవీందర్ సింగ్

ముద్ర, కరీంనగర్:

కరీంనగర్ నగర రాజకీయాల్లో ప్రజలకు దగ్గరగా ఉండే, మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడిగా పేరొందిన 58వ డివిజన్ కార్పొరేటర్, మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ గారు మరోసారి తన ప్రత్యేకతను చాటిచెప్పారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, పెళ్లికి ముందుగానే ఆడబిడ్డ ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి, కుటుంబ సభ్యులను ఆదరిస్తూ తన మానవీయతను ప్రదర్శించారు. కరీంనగర్ నగరంలోని 58వ డివిజన్‌కు చెందిన సుజాత–త్యాగరాజు దంపతుల కుమార్తె ప్రణీత వివాహం మే 13న జరగనున్న నేపథ్యంలో, ముందుగానే తన స్వగృహానికి ఆహ్వానించి సతీమణి సర్ధార్ గోల్డీ బల్బీర్ కౌర్ గారితో కలిసి ఆశీర్వదించి, ఇచ్చిన మాట ప్రకారం రూ.25,000 నగదును కట్నంగా అందజేశారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండాలని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మాట్లాడుతూ వారి సమస్యలను కూడా తెలుసుకుని, ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

“ప్రజల విశ్వాసమే నాకు అతిపెద్ద బలం. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాట నా బాధ్యత. ప్రజలు నమ్మి ఎన్నుకున్న తర్వాత ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి రాజకీయ నాయకుడి కర్తవ్యమై ఉండాలి” అని సర్ధార్ రవీందర్ సింగ్ గారు స్పష్టం చేశారు.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం, వారి సంతోషంలో భాగస్వామ్యం కావడం నిజమైన ప్రజా సేవ అని పేర్కొన్నారు. నగర ప్రజలు తనపై ఉంచిన విశ్వాసంతో వరుసగా ఆరు సార్లు కార్పొరేటర్‌గా గెలిపించారని గుర్తుచేస్తూ, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని అన్నారు.

స్థానికులు మాట్లాడుతూ, పెళ్లికి ముందే స్వయంగా వెళ్లి పలకరించి సహాయం చేయడం అరుదైన విషయం అని, ఇది నిజమైన ప్రజా నాయకత్వానికి నిదర్శనమని ప్రశంసించారు.

మాటలు కాదు… మనసుతో, ప్రేమతో ప్రజల ఆత్మీయ బంధం కొనసాగించే నాయకుడిగా సర్ధార్ రవీందర్ సింగ్

Leave A Reply

Your email address will not be published.