Take a fresh look at your lifestyle.

ల్యాణ లక్ష్మి షాదిముబారక్ లబ్ధిదారులకు సహాయాన్ని అందచేసిన ఆరెకపూడి గాంధీ

మాదాపూర్, ముద్ర విలేఖరి: కూకట్పల్లి మండలం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 10 మంది లబ్ధిదారులకు (10,01,160) పది లక్షల ఒక వేయి నూట అరవై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి చెక్కుల రూపేణా అందచేసిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఈ రోజు 10 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని, పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని , ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్నగా నిలుస్తారు అని ఎమ్మెల్యే గాంధీ గారు కొనియాడారు. నిరుపేద అడ బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా, మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగినది అని ,అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పేదింటి వారి ఇండ్ల లో సంతోషంతో ఆడ పిల్లల పెండ్లి జరగాలని సదుద్దేశంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చైర్మన్ గాంధీ తెలియచేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు నాయినేనీ చంద్రకాంత్ రావు, హరినాథ్, నాగేశ్వరరావు, అష్రాఫ్, శ్రీకాంత్, యాసిన్ మరియు లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.