Take a fresh look at your lifestyle.

విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి

  • సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి.
  • జిల్లా ఎస్పి అశోక్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వెల్గటూర్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ స్టేషన్ పరిసరాలను,పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్, 5 ఎస్ అమలు తీరు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డ్యూటీల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5ఎస్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాల ను తిరిగి క్షుణ్నంగా పరిశీలించారువిజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు.నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరగాలపై, ప్రస్తుతం వినియోగిస్తున్న నూతన పద్ధతులపై వివరించి వారిలో చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలన ఆక్సిడెంట్ జోన్ లుగా, బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు.ఎస్పి వెంట డిఎస్పి రఘు చంధర్, ఎస్.ఐ లు ఉమా సాగర్, సతీష్ పోలీస్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.