- పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి పై కుటుంబ సభ్యులు ధర్నా రాస్తారోకో
భారీగా ట్రాఫిక్ జాం. - ఇబ్బందులు పడ్డా ప్రయాణికులు.
ముద్ర ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి రేగొండ మండలంలోని రూపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన పిట్ట దేవేందర్ (48) కుటుంబానికి న్యాయం చే యాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కుటుంబ సభ్యులు గ్రామస్థులు, పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి రూపి రెడ్డిపల్లి గ్రామ రోడ్డు పై ధర్నా రాస్తారోకో జరిపారు. గ్రామానికి చెందిన పిట్ట దేవేందర్ పరకాల రైస్ మిల్లులో పనులకు వెళ్లి శుక్రవారం రాత్రి ఇంటికి ద్వి చక్ర వాహనం పై వస్తుండగా, వెనుకాల నుంచి వస్తున్న మరో ద్వి చక్ర వాహనము ఢీ కొట్టడంతో దేవేందర్ తలకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ హాస్పటల్ తీసుకెళ్లారు కానీ దేవేందర్ పరిస్థితి విషమించడం అక్కడి డాక్టర్లు దేవేందర్ బ్రతికే ఛాన్స్ లేదని చెప్పడంతో మళ్ళీ వరంగల్ యం జి యం హాస్పిటల్ తీసుకు వచ్చారు. కాగా దేవేందర్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు.అప్పటికే ద్వి చక్ర వాహనాలు డీ కొన్న విషయం తెలుసుకున్న దేవేందర్ కుటుంబ సభ్యులు రేగొండ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. కానీ పిర్యాదు చేసిన రోజు నుండి పట్టించుకోకుండా పోలీసులు ఉన్నారని దేవేందర్ మృతి చెందాడు. ఇప్పుడు అతని పిల్లల పరిస్థితి ఏమిటా పోలీసులు పట్టించుకోరా అని ఆగ్రహం వెక్తం చేసిన గ్రామస్తులు కుటుంబ సభ్యులు పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి పై బైటయించి ధర్నా రాస్తారోకో చేశారు. దాదాపు రెండు గంటలు సాగిన ధర్నా వల్ల పది కిలోమీటర్లు మేర వాహనాలు నిలిచి పోయాయి. రెండు గంటల సేపు ధర్నా జరగడం వల్ల సూదురా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్. తన సిబ్బంది తో ధర్నా వద్దకు చేరుకొని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ధర్నా నువ్వు విరమణ అయ్యేట్టు చేసారు.కుటుంబ సభ్యులు మాత్రం మృతుడు దేవేందర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని బిస్మించుకొని ఉన్నారు. మళ్ళీ ఎలాంటి సంఘటన లు జరుగుతాయో అని గ్రామంలో పోలీస్ బేటాలియం మెహరించరు. రూపిరెడ్డి పల్లి గ్రామం పోలీస్ వలయంగా మారింది. దేవేందర్ మృతితో రూపిరెడ్డి పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
