ముద్ర, కుషాయిగూడ:
డా. ఏ.ఎస్. రావు నగర్ కాలనీకి చెందిన కొందరు నివాసులు సోమవారం బీ ఆర్ ఎస్ నాయకుడు సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాలనీలోని ముఖ్య సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.హుడా పార్క్ సమీపంలో ప్రజా అవసరాల కోసం టాయిలెట్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ద్వారా స్థలం కేటాయించాలని కోరారు.డా. ఏ.ఎస్. రావు నగర్ ప్రవేశ ద్వారం–4 వద్ద పాదచారులు మరియు వాహనాల కదలికకు అనుకూలంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.అలాగే ట్రాఫిక్ లైట్లు ఉన్న ప్రవేశ ద్వారం–3 జంక్షన్ వద్ద అన్ని వైపులా జీబ్రా లైన్లు, స్టాప్ లైన్లు మార్కింగ్ చేయించాలని కోరారు.
ఈ అంశాలపై ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించి, మొదటి సమస్యకు సంబంధించి వెంటనే డిప్యూటీ కమిషనర్ కు ఫోన్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మిగిలిన సమస్యల విషయమై సంబంధిత అధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి, తగిన పరిష్కారం చూపుతా నని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాలనీ సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి, అలాగే ఈ సమావేశాన్ని సమన్వయం చేసిన సోమశేఖర్ రెడ్డి కి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు