Take a fresh look at your lifestyle.

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన వ్యాఖ్యలు : సిట్ పిలిస్తే సహకరిస్తా – కవిత

నాతో పాటు నా భర్త ఫోన్లూ ట్యాప్‌ చేసినట్లుంది
గుంట నక్కలతో కలిసి డ్రామాలు
జాగృతి అధ్యక్షురాలు కవిత

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ విచారించడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. సిట్ విచారణలో ఏంజరిగిందో కేసీఆర్‌ చెప్తారని అనుకుంటున్నానని, రెండేళ్లవుతున్నా.. ఫోన్ ట్యాపింగ్‌ కేసు ముగింపునకు రావట్లేదన్నారు. తన ఫోన్, భర్త ఫోన్లు ట్యాప్ చేశారని అనుమానాలున్నాయని ఆరోపించారు. విచారణ త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడేలా చూడాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత.. సిట్‌ విచారణలో ఏం జరిగిందో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు. సిట్‌ విచారణను తప్పుపడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. చట్టాలను అందరూ గౌరవించి.. సహకరించాలన్నారు. గుంట నక్కలతో కలిసి అధికార కాంగ్రెస్‌ డ్రామాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో పాటు నా భర్త ఫోన్లు ట్యాప్‌ చేశారనే అనుమానాలున్నాయిని ఆరోపణలు చేశారు. ఒకే వేళ సిట్‌ అధికారులు విచారణకు పిలిస్తే తప్పకుండా వెళ్లి సహకరిస్తానని కవిత వెల్లడించారు. తాజాగా కవిత తమ ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురై ఉంటాయని సంచలన ఆరోపణలు చేశారు.

కేటీఆర్ టార్గెట్
ఈ సందర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. మాజీ మంత్రి హరీష్ రావు లక్ష్యంగా వరుసగా విమర్శలు చేస్తున్న కవిత.. ఇప్పుడు మరోసారి హరీష్ తో పాటుగా కేటీఆర్ ను టార్గెట్ చేసారు. మున్సిపల్ ఎన్నికల్లో తన పార్టీ నుంచి అభ్యర్ధులను బరి లోకి దింపు తున్న కవిత.. రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైనా స్పందించారు. మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎవరు నిలబడ్డ కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారని ప్రస్తావించారు. చెడ్డ వాళ్లకి ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదని.. గుణం చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. పైసలు కాదని.. పని చేసేవారికి ఓటు వేయాలని సూచించారు. మంచి అభ్యర్థులు ఏ పార్టీ నుంచి పోటీ చేసిన ఓటు వేయాలని కోరారు. తెలంగాణ జాగృతి తరఫున మంచి అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. మరోసారి హరీష్ ను టార్గెట్ చేసారు. రేవంత్‌రెడ్డితో హరీశ్‌రావు కుమ్మక్కు అయి.. నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం అదే విధంగ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఫెయిర్‌గా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్‌ని సిట్ విచారణకు పిలిచిందని ప్రస్తావించారు. ఈ కేసులో సిట్ విచారణకు పిలిస్తే ఎవరైనా పోక తప్పదని కవిత స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు మోదీ సర్కార్ అన్యాయం చేసిందని కవిత విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. గంజాయి ముఠా దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ ఫీజు సొంతంగా కట్టుకున్నారా..? ప్రభుత్వ సొమ్ముతో కట్టారా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఈ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ వెళ్లి ఎన్ని ఏంఓయూలు చేసుకున్నారని నిలదీశారు.

Leave A Reply

Your email address will not be published.