ముద్ర: కాప్రా
నాచారం, మల్లాపూర్ ప్రాంతాలలో శానిటేషన్ ఇన్స్పెక్షన్‌లో భాగంగా జిహెచ్ఎంసి ఎడిషనల్ కమిషనర్ మల్కాజిగిరి వినయ్ కృష్ణారెడ్డి , జిహెచ్ఎంసి శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటి చెత్త సేకరణ పరిస్థితులు, చెత్త ఎక్కువగా పడే జీవీపీల వివరాలు, జీవీపీల ఎలిమినేషన్ చర్యలను వారు సమీక్షించారు.
ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ మజీద్ ఎదురుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు విత్ మైక్‌ల పనితీరును పరిశీలించారు. అలాగే ఎస్‌ఎఫ్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి చెత్త సేకరణ సర్వేలో భాగంగా గ్రీన్ హిల్స్ కాలనీలో ఇంటి యజమానులతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా స్వచ్ఛ ఆటో ల అటెండెన్స్‌ను ప్రతిరోజూ పరిశీలించాలని, ప్రతి ఇంటికి నిర్బంధంగా చెత్త సేకరణకు ఆటో వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు