త్వరలో పనులు ప్రారంభం అవుతాయి : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, భువనగిరి
భువనగిరి పట్టణంలోని జగదేవ్ పూర్ బ్రిడ్జి మరమ్మతులకు 76 లక్షల రూపాయల మంజూరు అయ్యాయి త్వరలో పనులు ప్రారంభం అవుతాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భువనగిరి అభివృద్ధి పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగదేవ్ పూర్ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలపై గత వారం రోజుల క్రితం అధికారులతో మాట్లాడి ఆ రోడ్డుపై ఒక నివేదిక ఇయ్యాలన్నారు. భువనగిరి పట్టణంలో అన్ని చౌరస్థాలను సుందరీకరంగా తీర్చిదిద్దుతామని భువనగిరి పుర ప్రముఖులు వివిధ పార్టీ నాయకులతో సమావేశమై ప్రతి ఒక్క సమస్యపై చర్చించి భువనగిరిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ట్రాఫిక్ ఎసిపి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ , నేషనల్ హైవే డిఈ, ఏఈ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సియంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే..
భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భువనగిరి పట్టణ, మండలానికి చెందిన 110 సియంఆరెఫ్ చెక్కులు 38,75,000/- రూపాయలు లబ్దిదారులకు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు.