ముద్ర ప్రతినిధి, భువనగిరి
భువనగిరి పట్టణంలోని జాగృతి డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు ఎం కామ్, బి బి ఏ, బీకామ్ గ్రూపులలో 4 గోల్డ్ మెడల్స్ సాధించి సత్తా చాటారు. సోమవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీ నాల్గవ స్నాతకోత్సవం యూనివర్సిటీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ, ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ బి ఎస్ మూర్తి హాజరయ్యారు. స్నాతకోత్సవంలో భాగంగా యూనివర్సిటీ టాపర్స్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం గోల్డ్ మెడల్స్ అందిస్తారు. ఇందుకుగాను జాగృతి కళాశాల నలుగురు విద్యార్థినులు బి.హారిక ఎం కామ్,
కే.భవాని బిబి ఏ, ఎన్.రమ్యశ్రీ , పి. యామిని బీకాంలు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బొజ్జ సూర్యనారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.